in

uppena beauty’s birthday gift!

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను నీలి సముద్రం. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం. నన్ను తీరానికి లాగేటి దారం. దారం’.. ఈ మధ్య ఏ నోట విన్నా ఎక్కువగా వినిపిస్తున్న పాట ఇదే. ఏదైనా చిత్రానికి హైప్ తీసుకురావాలంటే ఒక్క చిన్న ట్యూన్ చాలడానికి ‘ఉప్పెన’చిత్రంలోని ఈ పాటే ఉదాహరణ. దేవి శ్రీ స్వరపరిచిన ఈ పాటకు వస్తున్న మిలియన్ల వ్యూస్ ‘ఉప్పెన’లా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన వీడియో సాంగ్స్ .

ప్రచార చిత్రాల్లో కృతీ శెట్టి క్యూట్ లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సెప్టెంబర్ 21న కృతీ శెట్టి బర్త్ డే సందర్భంగా ‘ఉప్పెన’ చిత్ర యూనిట్ తాజాగా మరో పోస్టర్ ని విడుదల చేస్తూ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేసింది. ఈ పోస్టర్ లో కృతీ చేతికి గాజులు తొడుక్కుంటూ అందంగా కనిపిస్తోంది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఉప్పెన’ సినిమాకి మేకర్స్ భారీగానే ఖర్చు చేశారని టాక్ నడుస్తోంది..

office boy nundi top producer ga edhigina k raghava garu!

huge demand for chaithu’s love story!