in

Radhika Apte Trolled Over Balakrishna’s Legend!

Radhika Apte Trolled Over Balakrishna’s Legend!

Radhika Apte Trolled Over Balakrishna's Legend!

SOURCE:-

Radhika Apte Trolled Over Balakrishna’s Legend!, As Reproted on Website Filmy Focus

తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి నటి రాధికా ఆప్టే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఓ సౌత్ సీనియర్ హీరో షూటింగ్ సమయంలో తనను ఇబ్బందులకు గురిచేశాడంటూ పరోక్షంగా నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొంతకాలం తర్వాత ఆ వివాదం సద్దుమణిగినప్పటికీ, తాజాగా మరో ఇంటర్వ్యూలో రాధికా మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజా ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్న రాధికా ఆప్టే..ఒక తెలుగు సినిమాలో తనకంటే ఎక్కువ వయసున్న హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సినిమా షూటింగ్ సెట్‌లో పూర్తిగా పితృస్వామ్య వాతావరణం ఉండేదని చెప్పుకొచ్చింది..

అంతేకాకుండా, ఆ చిత్రంలో మేనమామను వివాహం చేసుకునే పాత్రలో నటించాల్సి వచ్చిందని, ఆ పాత్రను పోషించడం తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని తెలిపింది. సినిమాలో తన పాత్ర కథ మధ్యలోనే చనిపోతుందని, ఆ తర్వాత హీరో తనను పక్కకు విసిరేసి భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటాడని వివరించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాధికా ఆప్టే వ్యాఖ్యలపై బాలకృష్ణ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. గతంలో తెలుగులో బాలకృష్ణ నటించిన రెండు సినిమాల్లో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించిన విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సినిమాల్లో నటించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు..

అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, దక్షిణాది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కొందరు బాలీవుడ్ నటీమణులు ఆ తర్వాత అక్కడికి వెళ్లి సౌత్ ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాల గురించి విమర్శలు చేయడం గతంలోనూ చర్చకు వచ్చింది. ఇటీవల జాన్వీ కపూర్ కూడా ‘పెద్ది’ సినిమా యూనిట్ గురించి చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు రాధికా ఆప్టే మరోసారి పాత విషయాలను ప్రస్తావించడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. అసలు ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న పూర్తి సందర్భం ఏమిటి? ఈ వివాదంపై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎలా స్పందిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం నేపథ్యంలో మరోసారి సౌత్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలపై చర్చ మొదలైంది..!!

ALSO READ — Keerthy Suresh Compares Bollywood And South Cinema Work Culture!

Leave a Reply

Ramayana Collects Rs 100 Cr For 7 Consecutive Days!

Ramayana Collects Rs 100 Cr For 7 Consecutive Days!