in

uppena beauty Krithi Shetty fate may change again!

కప్పుడు రేసులో అనూహ్యంగా దూసుకొచ్చిన కృతి శెట్టి, అంతే అనూహ్యంగా వెనకబడిపోయింది. కథల ఎంపికలో పొరపాట్లు అనాలా.? లేదంటే, బ్యాడ్ టైమ్ అనుకోవాలా.? కారణం ఏదైతేనేం, ‘ఉప్పెన’ బ్యూటీ ప్రస్తుతం చాలా చాలా తక్కువ అవకాశాలతో నెట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ, మళ్ళీ ఆమె దశ తిరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం మూడు పెద్ద సినిమాల్లో కృతి శెట్టిని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. అందులో, ఇద్దరు యంగ్ మరియు స్టార్ హీరోలతో సినిమాలున్నాయని అంటున్నారు. మరొకటి, ఓ మోస్తరు యంగ్ హీరో అయినా.. చాలా పెద్ద సినిమా అట.!

తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ల కొరత వుంది. ఈ క్రమంలో దర్శక నిర్మాతలకి వేరే ఆప్షన్ కనిపించడంలేదు. ఈ మధ్యనే ఓ ముంబై బ్యూటీతో టెస్ట్ షూట్ నిర్వహించారు ఓ ప్రతిష్టాత్మక సినిమాకి. టెస్ట్ షూట్ రిజల్ట్ నెగెటివ్.. అని అంటున్నారు. ఆ వెంటనే హుటాహుటిన కృతి శెట్టికి కబురు పంపారట. కబురు అందగానే, హైద్రాబాద్‌లో వాలిపోయిందట కృతి శెట్టి. లుక్ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్‌గా వస్తే, ఆ ప్రెస్టీజియస్ మూవీలో కృతి శెట్టినే హీరోయిన్ అవ్వొచ్చని అంటున్నారు. ఇంకోపక్క, ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కూడా కృతి శెట్టిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా. ప్రెస్టీజియన్ మూవీయేనట.! పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..!

happy birthday S. S. Rajamouli!

Nagarjuna in talks with Tamil director for 100th film?