in

happy birthday S. S. Rajamouli!

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా బాహుబ‌లిని నిల‌బెట్టాడు. సినిమా మేకింగ్‌లో రాజ‌మౌళి ఆలోచ‌న‌ల‌కు తోడు మార్కెటింగ్ వ్యూహంలో అనుస‌రించిన ప్లాన్స్ వ‌ల్లే ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అభిమానుల‌ను అల‌రించింది. త‌న సినిమాను మార్కెట్ ఎలా చేయాలో అన్న‌ది రాజ‌మౌళికి తెలిసినంతంగా ఎవ‌రికి తెలియ‌దు అన్న‌ది నిజం. మ‌ణిర‌త్నం లాంటి ద‌ర్శ‌కుడే రాజ‌మౌళి స్ఫూర్తితోనే పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా చేశాను అని ప్ర‌క‌టించ‌డం రాజ‌మౌళి ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో రాజ‌మౌళి పేరు మారుమ్రోగుతోంది.

ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రాజ‌మౌళి ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరుపై హాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 2023 ఆస్కార్ అవార్డుల్లో ఈ సినిమా గ‌ట్టిపోటీనిచ్చే అవ‌కాశం ఉందంటూ సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు..ఆస్కార్ అవార్డుల కోసం చిత్ర యూనిట్ ఇండివిజువ‌ల్‌గా అప్ల‌య్ చేసింది. క్యాంపెయిన్ మొద‌లుపెట్టింది. 14 కేట‌గిరీల‌లో ఒక్క విభాగంలో అవార్డు ద‌క్కినా రాజ‌మౌళి చ‌రిత్ర‌ను సృష్టించ‌డం ఖాయ‌మే అంటున్నారు సినీ ప్ర‌ముఖులు..’వి విష్ అవర్ దర్శక ధీర వెరీ హ్యాపీ బర్త్డే..’

trivikram to rope in sai pallavi for allu arjun?

uppena beauty Krithi Shetty fate may change again!