in

top 10 best movies released during this pandemic!

10. JATHI RATNALU

ఫ‌న్నీ ఏజెంట్‌గా త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ఆయన పంచిన వినోదం సినీ ప్రియుల్ని క‌డుపుబ్బా న‌వ్వించింది. ఇప్పుడాయ‌న్ని ‘జాతిర‌త్నాలు’ చిత్రంతో మ‌రోసారి న‌వ్వులు పంచే ర‌త్నం అని నిరూపించింది. వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ తో మహాశివరాత్రి కానుకగా విడుద‌లైన ఈ చిత్రం సినీ ప్రియుల‌ను విపరీతంగా న‌వ్వించింది..లైఫ్‌లో స్థిర‌ప‌డాల‌నే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ల‌తో ఛాలెంజ్ చేసి జోగిపేట నుంచి హైద‌రాబాద్‌కి కి వచ్చిన ముగ్గురి రత్నాల కథ ఇది..చెప్పుకోవాలంటే ఇది చాలా చిన్న‌లైన్‌..కానీ ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కూ సినిమా ఆద్యంతం వినోదం పంచ‌డ‌మే ల‌క్ష్యంగా కొన‌సాగుతుంటుంది..

09. COLOR PHOTO

తెలుగు తెరపై ప్రేమ కథా చిత్రాలు ఎన్నో వచ్చి ప్రేక్షకులను మంచి అనుభూతిని పంచాయి. కులం, మతం, వర్ణానికి వ్యతిరేకంగా ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. అలాంటి కోవలోనే మళ్లీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడానికి వచ్చిన ప్రేమ కథ కలర్ ఫోటో. యూట్యూబ్, షార్ట్ ఫిలింస్‌లో అనుభవం ఉన్న నటీ, నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు. దసరా పండుగ సమయంలో పెద్ద సినిమాలు లేక అసహనం, అసంతృప్తితో ఉన్న ప్రేక్షకులకు కలర్ ఫోటో మంచి సంతృప్తి ఇచ్చింది..

08. MIDDLE CLASS MELODIES

న తెలుగు సినిమాల్లో హీరో ఎక్కువగా మధ్య తరగతి యువకుడిగానే కనిపిస్తాడు. అయితే ఆలోచనలు, ఆశయాలు అంతకుమించి ఉంటాయి. వాటిని మనం తప్పు పట్టలేం కానీ… అలాంటి యువకుడు జీవితంలో ఏదో సాధించాలని అనుకోవడం, దాని కోసం తపన పడటం, గెలవడం అనేది ఎప్పుడూ ఆసక్తికర అంశమే. అలాంటి కథాంశంతో రూపొందిన సినిమా ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా రిలీస్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది..

07. WILD DOG

కొత్త ర‌క‌మైన క‌థ‌ల్ని ప్రోత్స‌హించే క‌థానాయ‌కుడు నాగార్జున‌. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా..ఎన్‌.ఐ.ఎ నేప‌థ్యంలో సినిమా రూపొందుతోంద‌ని తెలియ‌గానే అంద‌రూ ఆ చిత్రంపై ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని వ్య‌క్తం చేశారు. 2006 నుంచి ఐదారేళ్ల పాటు భార‌త‌దేశంలో జ‌రిగిన బాంబు పేలుళ్ల సంఘ‌ట‌న‌ల్ని..ఈ పేలుళ్లు..వీటి వెనుక కుట్ర‌లు..దర్యాప్తు సంస్థ‌లు చేసిన ఆప‌రేష‌న్లు..సూత్ర‌ధారి యాసిన్ భ‌త్క‌ల్‌ని ఇండియాకి తీసుకురావ‌డం వంటివి కళ్ళకు కట్టినట్టు చూపించి ఈ వైల్డ్ డాగ్ ఆపరేషన్ సక్సెస్ చేసాడని చెప్పాలి..కింగ్ నటనకు వంద మార్కులు పడ్డాయి..

06. UMA MAHESHWARA UGRA RUPASYA

టీటీనే సరైన వేదిక అనుకొని అటువైపు అడుగులు వేశారు..‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అదే బాటలో పయనించింది. మలయాళ చిత్రాలంటే సహజత్వానికి పెట్టింది పేరు. అలాంటి చిత్రానికి ‘కేరాఫ్‌ కంచరపాలెం’ వంటి అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌ మహాను ఎంచుకోవడంతోనే చిత్ర బృందం సగం విజయం సాధించింది. మలయాళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా చక్కగా తీర్చిదిద్దారు. ప్రతి పాత్ర సహజంగా ఉంది తప్ప ఎక్కడా ఇరికించిన భావన కలగదు. అరకు ప్రాంతాన్ని నేపథ్యంగా చేసుకోవడంతో ప్రకృతి అందాలు సినిమాకు బాగా ప్లస్‌ అయ్యాయి.

05. NAANDHI

ల్ల‌రి న‌రేశ్‌ అన‌గానే కామెడీ సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. కానీ, ఆయ‌న అప్పుడ‌ప్పుడూ సీరియ‌స్‌గా సాగే పాత్ర‌ల్లోనూ క‌నిపించి మెప్పిస్తుంటారు. ‘గ‌మ్యం’, ‘శంభో శివ శంభో’ ‘మహర్షి’ త‌దిత‌ర సినిమాల‌తో న‌టుడిగా త‌న‌దైన ముద్ర వేశారు. చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి అలాంటి క‌థ‌ని ఎంచుకుని ‘నాంది’ చేశారు..థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది..చివరి వరకు ఉత్కంఠ గ సాగే ఈ ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా నరేష్ కెరీర్ కు కూడా బాగా ఉపయోగ పడిందనే చెప్పాలి..

04. UPPENA

ప్పుడెప్పుడా అని విడుదల గురించి ప్రేక్షకుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన చిత్రం ‘ఉప్పెన’.. సుకుమార్ రైటింగ్స్‌లో సిద్ధమైన ప్రేమ‌క‌థ కావ‌డంతో ఈ సినిమాపై అంచనాలు మ‌రింత‌గా పెరిగాయి..దానికి అనుగులాంగానే తొలి చిత్రం తోనే హీరో వైష్ణవ్‌తేజ్..హీరోయిన్ కృతి శెట్టి..డైరెక్టర్ బుచ్చిబాబు ముగ్గురు తామేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ ప్రేమ‌క‌థ స‌ముద్రం నేప‌థ్యంలో సాగ‌డం మ‌రింత ప్రత్యేకంగా అనిపించింది..మ్యూజిక్ ఈ సినిమాకు చాల ప్లస్ అయ్యింది..పాటల గురించి చెప్పక్కర్లేదు..ఉప్పెన ల ట్రెండ్ అయ్యాయి సాంగ్స్..చిన్న సినిమాగా వచ్చి ఈ ఏడాది భారీ హిట్ లో ఒకటిగా నిలిచింది..

03. KRACK

ర‌వితేజ పోలీసు పాత్ర‌లో న‌టిస్తే ఆ కిక్కే వేరు. ‘క్రాక్’ చిత్రంలో పోలీసు అధికారి వీర శంక‌ర్‌గా క‌నిపించి అభిమానుల్ని ఫిదా చేశారాయ‌న‌. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన చిత్ర‌మిది. శ్రుతి హాస‌న్ నాయిక‌. స‌ముద్ర ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు..పోత‌రాజు వీర‌శంక‌ర్ (ర‌వితేజ) నేర‌స్తుల ప‌ట్ల మహా దూకుడుగా వ్య‌వ‌హ‌రించే పోలీస్ అధికారి. ఎక్క‌డ ప‌నిచేసినా అక్క‌డ త‌న ప్ర‌భావం చూపిస్తుంటాడు. బ్యాక్‌గ్రౌండ్ మాటెత్తితే అస‌లేమాత్రం వీరశంకర్..అనే కాన్సెప్ట్ లో వచ్చిన రవి తేజ మాస్ ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు..

02. VAKEEL SAAB

బ‌ల‌మైన అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడాయ‌న. రాజకీయ వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉండ‌టంతో మూడేళ్లుగా ఆయ‌న నుంచి సినిమా రాలేదు. హిందీలో విజ‌య‌వంత‌మైన ‘పింక్’ సినిమా రీమేక్‌గా త‌న రీఎంట్రీ సినిమా ‘వ‌కీల్‌సాబ్‌’ని ప్ర‌క‌టించ‌డంతో అప్ప‌ట్నుంచి ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూసారు. ప్రొమోషన్స సినిమా పై మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచాయి. పవర్ స్టార్ రి ఎంట్రీ కూడా అదిరిపోయింది..వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసాడు..ఈ సినిమా త్వరలో మళ్ళి రిలీస్ చేస్తున్నారు అంటే లాయర్ సత్య దేవ్ క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేస్కోండి..

01. AAKASAM NEE HADDURA

యోపిక్‌లను తీయాలంటే చాలా ధైర్యం కావాలి. సినిమా నటుల జీవిత కథలంటే…కమర్షియల్‌ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలూ ఉంటాయి. కానీ ఇతరులు, ముఖ్యంగా వ్యాపారవేత్తల జీవిత కథలు అనేసరికి కత్తి మీద సామే..అలా వచ్చి విజయాలు సాధించిన వాళ్లు చాలా తక్కువ మంది. ‘ఆకాశం నీ హద్దురా’తో సుధ కొంగర అలాంటి ప్రయత్నమే చేశారు. ఈ విషయంలో ఆమె విజయవంతం అయ్యారనే చెప్పాలి. కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం పల్లెటూరు నుంచి విమాన సంస్థ అధిపతిగా ఎదిగిన క్రమం చూపించిన విధానం అద్భుతం..ఈ ఇయర్ బెస్ట్ సినిమాల్లో ఒకటి కూడా..

Jagame Thandhiram!

kiara advani shocks pooja hegde and rashmika!