in

TOP 10 BEST ITEM SONGS OF TOLLYWOOD 2021!

10. ‘DIGU DIGU DIGU NAGA’ FROM VARUDU KAAVALENU  

ది పూర్తిస్థాయి ఐటెం సాంగ్ కానప్పటికీ..జానపద భక్తి గేయాన్ని రక్తి గేయంగా మార్చేశారంటూ లిరిసిస్ట్ పై విమర్శలు వచ్చాయి. ఓ ప్రముఖ సినీ గేయ రచయిత బాధ్యత లేకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాట రాయడమేంటని పలువురు ప్రశ్నించారు. పబ్లిసిటీ స్టంట్ కోసం హిందువులను టార్గెట్ చేస్తున్నారని…వారి మనోభావాలను కించపరుస్తున్నారని…ఈ నేపథ్యంలో గేయ రచయిత అనంత శ్రీరామ్‌పై పలు చోట్ల కేసులు కూడా పడ్డాయి.

09. ‘RAMBA OORVASI’ FROM ALLUDU ADHURS

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ రంభ ఊర్వశి మేనక అంటూ చిందులేసింది. ఈ ఐటెం సాంగ్ లో మోనాల్ ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఐటెం సాంగ్ మాత్రం యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయ్యింది. అల్లుడు సంగతి ఏమిటో గాని మోనాల్ అందాలు మాత్రం అదుర్స్ అన్నారు ప్రేక్షకులు.

08. ‘NAA TAPPU EMUNNADABBA’ FROM BLACK ROSE

4రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకి జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు. స్వతహాగా మంచి డాన్సర్ అయినా ఊర్వశి ఈ సాంగ్‌లో కష్టమైన డ్యాన్స్ మూవ్ మెంట్స్‌తో అలరించడం విశేషం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ డ్యాన్స్ స్టెప్స్ స్ఫూర్తిగా కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్‌కి రిహార్సల్స్ చేస్తూ ఊర్వశి పలుమార్లు గాయపడినా నేర్చుకొని డ్యాన్స్ చేసింది..ఊర్వశి రౌతేల తన అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్‌తో విశేషంగా ఆకట్టుకుంది.

07. ‘CHANGURE’ FROM GULLY ROWDY

సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ చిత్రంలో నటి స్నేహ గుప్త ఐటెం సాంగ్ లో పెర్ఫామ్ చేసింది. మంగ్లీ తన ఎనెర్జిటిక్ వాయిస్ తో పాడిన ఈ పాటలో స్నేహ గుప్త ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. నాజూకైన అందాలతో మత్తెక్కించే స్టెప్పులతో ఒక ఊపు ఊపింది. భాస్కర బట్ల ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఈ పాటకు కథాంశానికి లేదా చిత్రంలో ముగుస్తున్న సంఘటనలకు ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా వినోద విలువ కోసం మాత్రమే.

06. ‘PAINA PATAARAM’ FROM CHAAVU KABURU CHALLAGA

టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ హీరో కార్తికేయతో కలసి చావు కబురు చల్లగా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. రెడ్ శారీలో అనసూయ తన డాన్స్ తో అలరించింది. ఈ పాటని పాడింది కూడా మాస్ సింగర్ మంగ్లీనే..అనసూయ డాన్స్ ఈ సాంగ్ కు హైలైట్ గ నిలిచింది..సినిమా రిసల్ట్ ఎలా ఉన్న ఈ సాంగ్ మాత్రం బాగా ట్రెండ్ అయ్యి సినిమాకే హైప్ తెచ్చింది.

05. ‘MANDHULODA’ FROM SRIDEVI SODA CENTER

టి స్నేహ గుప్త పెర్ఫామ్ చేసిన మరో ఐటెం సాంగ్ ‘మందులోడా’. సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ చిత్రంలోని ఈ స్పెషల్ నంబర్ జానపద తరహాలో సాగుతూ అలరించింది. సుధీర్ బాబు, స్నేహ గుప్త ఇద్దరూ ఈ సాంగ్ లో మాస్ స్టెప్పులతో అలరించారు. ఈ సాంగ్ తో స్నేహ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి..ఫ్యూచర్ లో ఈ భామ మరిన్ని ఐటెం సాంగ్స్ చేసి మనల్ని అలరించడం ఖాయం.

04. ‘BHOOM BHADDAL’ FROM KRACK

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది Krack చిత్రంతో మాస్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులని అంతగా అలరించిందో అదే స్థాయిలో ఈ మూవీలోని భూమ్ బద్దల్ అనే ఐటెం సాంగ్ థియేటర్స్ ని కుదిపేసింది. నటి అప్సర రాణి తన ఎనెర్జిటిక్ స్టెప్పులతో, గ్లామర్ తో మతిపోగొట్టేసింది. తమన్ ఈ సాంగ్ కి రీసౌండింగ్ మ్యూజిక్ అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

03. ‘PEPSI AUNTY’ FROM SEETIMAAR

టెం బ్యూటీ అప్సర రాణి ఈ ఏడాది పెర్ఫామ్ చేసిన మరో ఐటెం సాంగ్ ‘పెప్సీ ఆంటీ’. గోపీచంద్ సిటీమార్ చిత్రంలోని ఈ సాంగ్. ‘నా పేరే పెప్సీ ఆంటీ’ అంటూ అప్సర రాణి గ్లామర్ ఒలకబోసింది. ఈ సాంగ్ కూడా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన సీటీమార్ మూవీ పర్వాలేదనిపించింది. ముమైత్ ఖాన్ తరువాత ఆ రేంజ్ లో ఐటెం హీరోయిన్ గా ముద్ర వేయించుకోవడానికి అప్సర బాగా కష్టపడిందనే చెప్పాలి.

02. ‘DINCHAK’ FROM RED

రామ్ నటించిన రెడ్ మూవీ జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలయింది. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించలేదు. కానీ ఈ మూవీలో కుర్ర బ్యూటీ హెబ్బా పటేల్ పెర్ఫామ్ చేసిన డించాక్ అనే ఐటెం సాంగ్ ని మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ సాంగ్ లో రామ్, హెబ్బా పటేల్ స్టెప్పులు కిక్కిచ్చేలా ఉంటాయి.

01. ‘OO ANTAVA..OO OO ANTAVA’ FROM PUSHPA

ల్లు అర్జున్, సమంత అభిమానులంతా ఎంతగానో వెయిట్ చేసింది ఈ ఐటెం సాంగ్ కోసమే. సమంత తన కెరీర్ లో తొలిసారి చేసిన ఐటెం సాంగ్ ఇది. ఇప్పటికే లిరికల్ వీడియోలో సౌత్ ఇండియాలోనే రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ పై క్రేజ్ ఎలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు…సమంత స్పెషల్‌ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాటలో పురుషుల మనోభావాలను దెబ్బ తీసేలా చరణలు ఉన్నాయని కొందరు కేసు నమోదు చేశారు.

Samantha Ruth Prabhu turns Nurse for ‘Yashoda’!

sneha ullal gives shocking reply to manchu manoj’s covid post!