rajamouli nu jakkana ga marchina Rajeev Kanakala!
తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన పట్టుకున్న కథ హిట్ కావాల్సిందే. అంతగా దానిపై దృష్టిపెడతారాయన. సినిమాలోని ప్రతి సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా వచ్చేంత వరకూ టేక్ మీద టేక్ తీస్తుంటారు. అలా అన్ని సీన్లని ఎన్నోసార్లు చెక్కీ చెక్కీ మనకు అద్భుతాల్ని అందిస్తుంటారు. అందుకే ఆయన్ను అందరూ ‘జక్కన్న’ అని ముద్దుగా పిలుస్తారు. మరి రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టిందెవరో తెలుసా? ఆయనెవరో కాదు నటుడు రాజీవ్ కనకాల..‘నా సీన్‌కి సంబంధించిన [...]