in

ANTHAHPURAM UNIT SABHYULANU NILUVU DOPIDI CHESINA MARISHUS DONGALU!

అంతఃపురం సినిమా షూటింగ్ కోసం మారిషస్ వెళ్లిన సందర్భం లో, దొంగలు , నటి నటులు, సాంకేతిక నిపుణులు అందరిని నిలువుదోపిడీ చేసేసారు. అది అంతఃపురం షెడ్యూల్ ఆఖరిరోజు షూటింగ్ మారిషస్ లో యూనిట్ అంత షూటింగ్లో బిజీ గ ఉన్నారు, షూటింగ్ ముగించుకొని వాళ్ళు స్టే చేసిన గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చారు అందరు, వెళ్ళేటప్పుడు ఏమేమి షాపింగ్ చేయాలో ప్లాన్ చేసుకుంటూ వచ్చిన వారికీ, వాళ్ళ రూమ్ లు తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యమేసింది. కంగారుగా రూమ్ లోకి వెళ్లి చూసుకుంటే ఏముంది అంతా ఊడ్చేశారు దొంగలు.

దూరంగా సముద్రంలో వీరి బ్యాగ్లు, బట్టలు తేలుతూ కనిపించాయి. డబ్బు, విలువయిన వస్తువులు తీసుకొని వీరి బట్టలు, బ్యాగ్లు నీటిలో పడేసి పోయారు దొంగలు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా మిగిలారు అందరు. షూటింగ్ పూర్తి చేసుకున్న సంతోషం ఆవిరి అయిపొయింది, ఇక ఇండియా చేరేది ఎలా అనే సందేహం లో పడిపోయారు అందరు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి, అక్కడ తెలిసిన వారి వద్ద కొంత డబ్బు సర్దుబాటు చేసుకొని, అందరు ఉసూరు మంటూ తిరుగు ప్రయాణం అయ్యారు.

Nivetha Pethuraj becomes a certified Formula one car racer!

telugu anchor varshini shines in white!