in

DIRECTOR KRISHNA VAMSI NI YEDIPINCHINA N.T.R!

డైరెక్టర్ కృష్ణ వంశి ని ఏడిపించిన జూనియర్ యెన్.టి.ఆర్., కృష్ణ వంశి డైరెక్షన్ లో యెన్.టి.ఆ.ర్. నటించిన చిత్రం రాఖీ, హావ , భావాలను పలికించ గలిగిన మనకున్న కొద్దిమంది నటులలో యెన్.టి.ఆ.ర్. ఒకరు అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. చాల ఎమోషనల్ సబ్జెక్టు తో తెరకెక్కిన సినిమా రాఖీ. యెన్.టి.ఆర్. లోని నిజమయిన నటుడిని బయటకు తీసిన సినిమా రాఖీ.

అత్తవారి దాష్టీకానికి బలి అయిన తన ముద్దుల చెల్లెలి ని ఖననం చేసే సీన్ తీస్తున్నప్పుడు..యెన్,టి,ఆర్, నటనకి లోపల కన్నీరు, మున్నీరవుతూ పంటిబిగువున ఏడుపు ఆపుకొని, ఆ సీన్ షూట్ చేశారట డైరెక్టర్ కృష్ణ వంశి. షూటింగ్ జరుగుతున్నపుడు తన నటనతో డైరెక్టర్ ను ఏడిపించిన యెన్.టి.ఆర్., సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులను ఏడిపించారు. ఇటీవల రాఖీ గురించి తన అనుభవాలను చెప్తూ, ఈ విషయాన్ని కృష్ణ వంశి గారే వెల్లడించటం జరిగింది.

Anasuya Bharadwaj Beautiful in Sky Blue Saree Stills!

Sarpatta Parampara!