BHANUMATI VS CHAKRAPANI!
విజయాధినేత చక్రపాణి గారి మీద కోపం తో ఆయన పేరును టైటిల్ గ పెట్టి సినిమా తీసిన భానుమతి గారు. విజయ సంస్థ నిర్మించిన మిస్సమ్మ చిత్రంలో హీరోయిన్ రోల్ కి మొదట భానుమతి గారిని తీసుకోవటం జరిగింది, షూటింగ్ జరుగుతున్న సమయం లో, భానుమతి గారి ఇంట్లో ఏదో వ్రతం ఉండటం తో ఆమె షూటింగ్ కి ఆలస్యంగా వస్తానని అసిస్టెంట్ డైరెక్టర్ కి చెప్పారు కానీ అతను ఆ విషయం చక్రపాణి గారికి చెప్పటం [...]