in

N.T.R. DARSAKUDIGA MARINA VELA!

యెన్.టి.ఆర్. దర్శకుడిగా ఎందుకు మారవలసి వచ్చింది, రావణాసురుడు అనగానే నెగటివ్ షేడ్, అటువంటి రావణాసురుడి క్యారెక్టర్ యెన్.టి.ఆర్ ఎందుకు నటించారు. యెన్.టి.ఆర్ కి ఆప్తుడు అయిన బుచ్చి వెంకట కృష్ణ చౌదరి “సీత రామ కళ్యాణం” అనే పుస్తకం తెచ్చిచ్చారు, దానిని చదివిన యెన్.టి.ఆర్, తన గురువు అయిన కె.వి.రెడ్డి గారిని కలిసి, తాను ఈ చిత్రాన్ని నిర్మించ దలచినట్లు చెప్పి, దీనికి తగిన స్క్రీన్ప్లే తయారు చేయమని కోరారు. ఈ చిత్రం లో ఎస్.వి.ఆర్ రావణాసురుడి గ , తాను రాముడిగా నటిస్తాము అని చెప్పారట. ఇది జరిగిన కొద్దీ రోజులకు బి.వి.కె. చౌదరి గారు “సీత పరిభ్రమణ విభ్రమం ” అనే మరో పుస్తకాన్ని తెచ్చి ఇచ్చారు, అది చదివిన యెన్.టి.ఆర్, రెండో సారి కూడా ఆ పుస్తకాన్ని చదివారు, ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు, అందులో రావణాసురుడిని మరో కోణం లో చూపించారు రచయిత, అది యెన్.టి.ఆర్. ని ఎంతో ఆకట్టుకుంది. అంతే రావణాసురుడిగా తానే నటించాలి అనుకున్నారు..

వెంటనే కె.వి.రెడ్డి గారిని కలసి విషయం చెప్పి, ఈ కధకు స్క్రీన్ప్లే తయారు చేయమని కొరారు, రావణాసురిడిగా తానే నటిస్తానని చెప్పారు. ఆ కథను చదివిన కె.వి. రెడ్డి గారు కొంత ఆలోచనలో పడ్డారు,పురాణాలను వక్రీకరించటం అవుతుందేమో? జన బాహుళ్య అభిప్రాయానికి వ్యతిరేకంగా, తెర మీద యెన్.టి.ఆర్ కనిపిస్తే చూస్తారా ?అనే సందేహం కలిగింది, తన శిష్యుడు తన మీద ఉంచిన నమ్మకానికి న్యాయం చేయలేనేమో అనిపించి, ఈ చిత్రాన్ని తాను చేయలేనని చెప్పేశారట. గురువు మనసెరిగిన యెన్.టి.ఆర్. ఈ చిత్రానికి మరో దర్శకుడిని తీసుకొని ఆయనను కించ పరచకూడదు అనుకోని, ఆ బాధ్యతను తానే నిర్వహిస్తే, జయ, అపజయాలకు తానే బాధ్యత వహించినట్లవుతుంది అనే ఉద్దేశం తో దర్శకుడి అవతారం ఎత్తారు. తాను నమ్మిన కథను ఎంతో విశ్వాసం తో సినిమాగా మలచారు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు, ప్రతి నాయకుడిలో కూడా మంచి చెడు ఉంటాయని నిరూపించారు, నటుడికి నటన ప్రధానం అంతే కానీ, అది నాయకుడి పాత్ర,ప్రతి నాయకుడి పాత్ర అనేది ముఖ్యం కాదని చాటి చెప్పారు, పనిలో పనిగా తనలోని దర్శకత్వ ప్రతిభను కూడా చాటుకున్నారు..!!

Prabhas and Sukumar film on Cards?

sreeleela..an headache for kriti shetty!