in

OLD RAMA SUPPORTED NEW RAMA!

కొత్త రాముడిని ఓదార్చిన పాత రాముడు, కొత్త రాముడు, పాత రాముడు ఏమిటి అనుకుంటున్నారా. తెలుగు వారికీ సంబంధించినంత వరకు వెండి తెర రాముడు అంటే యెన్.టి.ఆర్., అటువంటిది బాపు గారు శోభన్ బాబు ని రాముడిగా పెట్టి సంపూర్ణ రామాయణం చిత్రం తీశారు, ఈ చిత్రం తీయటానికి ముందు వారు యెన్.టి.ఆర్. ని సంప్రదించి వారి అనుమతి తోనే వారు లేకుండా ఈ చిత్రాన్ని తీశారు. విజయవాడ వినోద థియేటర్ లో సినిమా రిలీజ్ అయింది, ఆ సందు చివరి ఉన్న నవోదయ పబ్లిషర్స్ లో కూర్చున్న బాపు, రమణ గార్లు ఓ కుర్రోడిని థియేటర్ దగ్గరకు పంపించి ప్రతి షో కి జనం ఎలా ఉన్నారు అని వివరాలు కనుక్కుంటున్నారు, మొదటి రెండు రోజులు అంత ఆశాజనకం గ లేవు ఆ కుర్రోడి రిపోర్టులు, దానితో డీలా పడ్డారు బాపు, రమణలు. విషయం తెలిసిన శోభన్ బాబు గారు కూడా కాస్త కంగారు పడ్డారు, ఆ ఆందోళనలో శోభన్ బాబు గారు, యెన్.టి.ఆర్. వద్దకు వెళ్లి విషయం చెప్పారట.

అది విన్న యెన్.టి.ఆర్. కంగారు పడొద్దు బ్రదర్, సినిమా చాల బాగా తీశారు, కానీ రాముడిగా కొత్తవారిని చూడటానికి ఆంధ్ర ప్రేక్షకులు కొంత సమయం తీసుకుంటారు, అది కాకా చిత్రం తీసింది ఏ కె.వి.రెడ్డో, లేక కమలాకర కామేశ్వర రావు అయి ఉంటె ప్రేక్షకులు కొంత వచ్చి ఉండేవారు, పౌరాణికాలు కు డైరెక్టర్ కొత్త వారు, అలాగే రాముడిగా నువ్వు కొత్త వాడివే, కొంత మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే నాలుగు అయిదు రోజులలో కలెక్షన్స్ పిక్ అప్ అవుతాయి అని ధైర్యం చెప్పారట యెన్.టి.ఆర్. యెన్.టి.ఆర్. చెప్పినట్లే ఆ చిత్రాన్ని కొంత ఆలస్యంగానే ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు, అదే వినోద థియేటర్ లో 100 రోజులు నడిచింది సంపూర్ణ రామాయణం. విశ్వనాధ సత్యనారాయణ గారి వంటి వారు ఆ చిత్రంలోని నేపధ్య సంగీతానికి కితాబు ఇచ్చారు, ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు.తెలుగు వెండి తెరకు పాత రాముడి ఆశీర్వాదం తో ఒక కొత్త రాముడు దొరికాడు..!!

Varun Dhawan drops hints about Kriti Sanon, Prabhas’s relationship!

CINEMAYE LIFE RA MAMA, LIFE ANTHA CINEMA MAMA!