in

N.T.R SALAHA THO SILVER jubilee KOTTINA KRISHNA!

యెన్.టి.ఆర్. సలహాతో సినిమా నిర్మించిన హీరో కృష్ణ, అదే సినిమా కృష్ణ గారి సినీ కెరీర్ లో మొట్టమొదటి సిల్వర్ జూబిలీ సినిమా అయింది. మోసగాళ్లకు మోసగాడు సినిమా నిర్మాణం తరువాత కృష్ణ గారు ఆ సినిమాను యెన్.టి.ఆర్. కి చూపించారు, సినిమా చుసిన యెన్.టి.ఆర్. సినిమా హిట్ అవుతుంది కానీ ఫామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించారు అని చెప్పేసారు, అదే నిజం అయింది, మోసగాళ్లకు మోసగాడు పెద్ద హిట్ కానీ ఫామిలీ ఆడియెన్సుకి దగ్గర కాలేక పోయింది. ఆ తరువాత కొంత కాలానికి నటుడు ప్రభాకర్ రెడ్డి ఒక ఉమ్మడి కుటుంబం కథ తయారుచేసుకొని పెట్టుబడి కోసం కృష్ణ గారిని కలిశారు, కధ బాగుంది, ఒక సారి యెన్.టి.ఆర్ కి చూపించుదాము అని చెప్పారు కృష్ణ గారు, అయన ఒకే అంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పారు. స్టోరీ ఫైల్ యెన్.టి.ఆర్. కి చేరింది అది చదివిన యెన్.టి.ఆర్ కధ బాగుంది, చాల గొప్ప చిత్రం అవుతుంది అంటూ అయన చేసిన వ్యాఖ్యలు ఎప్పటికి చిరస్మరణీయం,ఆచరణ యోగ్యం. సినిమా అనేది” మేక్ బిలీవ్ “ప్రక్రియ, లేని దాని ఉన్నట్లుగా నమ్మించగలగాలి.

ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం అయిపోయాయి, ఉమ్మడి కుటుంబం గ ఉండాలనే కోరిక ఉన్నా కూడా, ఉండలేని, సామాజిక పరిస్థితులలో, ఉమ్మడి కుటుంబంలోని మాధుర్యాన్ని, గొప్ప తనాన్ని చూపుతుంది ఈ కధ. నిత్యం తమ జీవితాలలో జరిగే విషయాలను తెర మీద చూడటానికి ఇష్టపడరు ప్రేక్షకులు, తమ జీవితాలలో ఏదయితే లోపించినదో దానిని తెర మీద చూసి, తమకు అన్వయించుకొని ఆనందిస్తారు ప్రేక్షకులు, అటువంటి కధా వస్తువులకు, బ్రహ్మ రధం పడతారు, కాబట్టి ఈ చిత్రం సరి అయిన స్క్రిప్ట్ తో, తారాగణం తో నిర్మిస్తే ఘన విజయం సాధిస్తుంది అని చెప్పారట యెన్.టి.ఆర్.అయన సలహా మేరకు ఆ చిత్రానికి పెట్టుబడి పెట్టడమే కాకుండా భారీ తారాగణం తో ఖర్చుకు వెరవకుండా నిర్మించిన చిత్రమే “పండంటి కాపురం”. కృష్ణ గారి కెరీర్ లో మొట్టమొదటి సిల్వర్ జూబిలీ చిత్రం, ఆ ఫంక్షన్ కి ముఖ్య అతిధి గ వచ్చిన యెన్.టి.ఆర్. ని స్టేజి మీద కృష్ణ గారు, మీరు అనుమతిస్తే నా బానర్ లో మీతో ఒక చిత్రం చేస్తాను అని అభ్యర్ధించటం, యెన్.టి.ఆర్. అందుకు అంగీకరించటం జరిగిపోయాయి. అదే మరో సూపర్ హిట్ సినిమా “దేవుడు చేసిన మనుషులు”..!!

thamanna’s counter, introduces herself as ‘businessman husband’!

Sequel to Samantha’s Yashoda is on cards?