in

this is why vijay sethupathi quit ‘pushpa’!

వర్ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ – సుకుమార్ ‘పుష్ప’ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు.అయితే ఈ సినిమాలో నటించడానికి ముందు ఓకే చెప్పి తర్వాత చేయలేనని తప్పుకున్నాడు. దీనిపై టాలీవుడ్ లో చాలా కారణాలు వినిపించాయి. తమిళనాడుకు చెందిన గంధపు చెక్కల స్మగ్లర్ గా ఇందులో విలన్ పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో నటిస్తే తమిళ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే మీడియాలో వినిపిస్తున్నట్లు ఇలాంటి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తాజాగా విజయ్ సేతుపతి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.పుష్ప సినిమా చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ సినిమా డేట్స్ అడిగిన సమయంలో తనకు ఇతర సినిమాలు కమిట్మెంట్ ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు.

CHAITHU PREFERRED RASHMIKA OVER KEERTHI?

nayanthara upset with the rumors!