యువ దర్శకుడు సుజీత్ మెగా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. లూసిఫర్ రిమేక్ బాధ్యతలని ఆయనకి అప్పగించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ.. ఆ సినిమా నుంచి సుజీత్ ని తప్పించి వినాయక్ కి అప్పగించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై మెగాస్టార్ వివరణ ఇచ్చారు. సుజిత్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కొత్తగా పెళ్ళికావడంతో స్క్రిప్ట్ పైన దృష్టి పోవడంతో తనను మన్నించమని కోరినట్లు చిరు వెల్లడించాడట. దానికి తాను అంగీకరించినట్లు.. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ బాధ్యత వినాయక్ తీసుకున్నాడని చిరంజీవి పేర్కొన్నారని తెలుస్తోంది.అయితే అసలు నిజం మాత్రం అదికాదట. సుజీత్ రెడీ చేసిన స్క్రిప్ట్ మెగాస్టార్ కి నచ్చలేదని తెలుస్తోంది.