in

shriya about acting with king nagarjuna!

టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రియ శరన్ అంటే తెలియని తెలుగు ఆడియెన్స్ ఉండరు. కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వచ్చినంత క్రేజ్ మరెక్కడా రాలేదనే చెప్పాలి. గత 19 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ అప్పటికి ఇప్పటికి అదే తరహాలో మెరుస్తోంది.పెళ్ళైనా కానీ సినిమాలకు గుడ్ బై చెప్పకుండా.. అడపాదడపా వెండితెర పై మెరుస్తూనే ఉంది. మంచి స్క్రిప్ట్ ఉంటే.. సినిమాకు ఓకే చెప్తా అంటుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఒక డాన్స్ వీడియో చేయగా అందులో తనను చూసిన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇష్టం సినిమా కోసం తీసుకున్నారు. ఆ తర్వాతా వరుసగా ఆఫర్లు వచ్చాయని తెలిపిందిబీ. ఇక నాగార్జున తో కలిసి సంతోషం సినిమా చేసే టైంలో నా వయసు చాలా తక్కువ. అప్పటి జ్ఞాపకాలను నేను ఎప్పటికి మర్చి పోలేను. నాగార్జున గారితో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆయనతో ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించినా కూడా మరిన్ని సినిమాల్లో నటించాలని కోరకుంటున్నాను. నాగార్జునతో కలిసి నటించడానికి నేను ఎప్పుడు సిద్దమే అని గతంలో శ్రియ చెప్పుకొచ్చింది. నాగ్ తో కలిసి చివరిగా ఈ భామ ‘మనం’ సినిమాలో నటించింది.

this is why sujith replaced with vinayak!

sp Balasubrahmanyam passes away!