in

sharwanand to romance young beauty manasa varanasi!

శర్వానంద్‌  కొత్త సినిమా ‘జార్జ్‌ క్రిష్‌’పై మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మానస వారణాసిని ఎంపిక చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా ఆమె కనిపించనున్నారు. ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ సినిమాతో ఇటీవల మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస.. తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘జార్జ్‌ క్రిష్‌’లో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శర్వానంద్‌, శ్రీను వైట్ల తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. శర్వానంద్‌ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు. ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్‌’ సినిమాలు ఇటీవల ప్రేక్షకులను అలరించాయి..

AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్‌ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్‌ కూడా ఉంది. ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి సినిమాలు సంక్రాంతి బరిలోకి వచ్చి విజయాలు అందుకున్నాయి. దీంతో ‘జార్జ్‌ క్రిష్‌’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత సురేశ్‌బాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ క్లాప్‌ కొట్టారు. తొలి షాట్‌కు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు..!!

The Paradise Movie Review

The Paradise Movie Review!

Prithviraj Sukumaran in Nani’s upcoming film Bloody Romeo?