in

thapsi’s new workout video becomes a hot topic!

రుసగా మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ తాప్సీ. ఈ ఏడాది `తప్పడ్`లో నటించి మెప్పించిన తాప్సీ ప్రస్తుతం మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. `రష్మీ రాకెట్` పేరుతో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో తాప్సీ అథ్లెట్‌గా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం తాప్సీ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. కఠినతర వ్యాయామం చేసి ప్రత్యేకంగా సంసిద్ధమైంది.

పూర్తి స్థాయి అథ్లెట్‌గా కనిపించేందుకు జిమ్‌లోనూ, ట్రాక్ మీద చెమటోడ్చింది. దానికి సంబంధించిన వీడియోను తాప్సీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “రష్మీ రాకెట్` కోసం చివరి ట్రైనింగ్ సెషన్‌ను పూర్తి చేశాను..ఈ సినిమా కోసం నేను చేసిన ప్రయాణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా జర్నీకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ఇది` అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. తాప్సీ కష్టాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, భూమీ ఫడ్నేకర్ తదితరులు ప్రశంసించారు…

Sudhir and Rashmi Gautam are missing each other!

Sai Pallavi becomes fidaa over Mahesh Babu’s flawless skin!