సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు అస్సలు అంగీకరించదు మిల్కీబ్యూటీ తమన్నా. కెరీర్ తొలినాళ్ల నుంచి ఆమె ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తోంది. హద్దులు మీరని అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఈ సొగసరి తెరపై ముద్దుముచ్చట్లకు మాత్రం దూరంగా ఉంటుంది. ఒకవేళ ఈ నియమాన్ని బ్రేక్ చేయాల్సివస్తే తాను హీరో విజయ్ దేవరకొండకు ముద్దు ఇస్తానని తమన్నా చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే…
అగ్ర కథానాయిక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘సామ్‌జామ్’ షో తాజా ఎపిసోడ్‌కు తమన్నా అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాయిష్టాలపై అనేక ఆసక్తికరమైన సంగతుల్ని పంచుకుంది తమన్నా. సినిమాల్లో ముద్దు సీన్లలో నటించనని రూల్ పెట్టుకున్నారు కదా…ఒకవేళ దానిని బ్రేక్ చేయాల్సివస్తే ఎవరిని కిస్ చేస్తారు? అని సమంత అడిగిన ప్రశ్నకు..తాను విజయ్‌దేవరకొండకు ముద్దిస్తానని సరదాగా సమాధానమిచ్చింది తమన్నా..