in

Tharun Bhascker and Eesha Rebba Makes their relation Official

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా, కథానాయకుడిగా తరుణ్ భాస్కర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో యువతలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం భార్య నుంచి విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ ఈషా రెబ్బాతో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అంతే కాదు..వాళ్లిద్దరి రిలేషన్షిప్‌పై బోలెడు రూమర్లు వచ్చాయి. అయితే తమ మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటి వరకు ఇద్దరూ స్పందించలేదు. పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించటంతో రిలేషన్షిప్‌పై రూమర్లు వైరల్ అయ్యాయి..

ఇప్పుడు వాటికి ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు. వినాయక చవితి నాడు జంటగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్. దాంతో తమ మధ్య బంధం గురించి అధికారికంగా ప్రకటించినట్టు అయ్యింది..ఓం శాంతి శాంతి శాంతి’ లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. అందులో భార్యాభర్తలుగా కనిపించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు అది తెలుగు రీమేక్. ఆ సినిమా ప్రమోషన్లలో తరుణ్, ఈషా మధ్య కెమిస్ట్రీ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. సంథింగ్ స్పెషల్ అని అర్థం అయ్యింది..!!

Rashmika Mandanna To Play M S Subbulakshmi In Biopic!