in

telugu girl Meenakshi Chaudhary locked for Venkatesh!

వెంకటేష్, అనిల్ రావి పూడి లది హిట్ కాంబినేషన్. వీరి నుంచి F2,F3 వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ హిట్ జోడి మరో సారి ప్రేక్షకులని అలరించటానికి రెడీ అయ్యారు. ఈ మూవీలో ఇప్పటివరకు హీరోయిన్ ఎవరన్నది ఫిక్స్ కాలేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కే ఈ సినిమాలో మీనాక్షి నటిస్తే, నెక్స్ట్ దిల్ రాజు బ్యానర్ మూవీస్ లో కచ్చితంగా ఈ అమ్మడికి ఛాన్స్ లుంటాయి.

ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే మీనాక్షి చౌదరిని సంప్రదించినట్టు సమాచారం. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మీనాక్షి ఒక వైపు యంగ్ హీరోలతో నటిస్తూనే, సీనియర్స్ తో కూడా జోడి కడుతోంది. రవితేజతో ఖిలాడీ సినిమా చేసింది. మహేష్ తో గుంటూరు కారం, ఇపుడు వెంకీ తో కలిసి నటిస్తోంది. ఇప్పటివరకు సెకండ్ హీరోయిన్ కే పరిమితం అయ్యింది. సరైన గుర్తింపు రాలేదు. ఇప్పడిప్పుడే పెద్ద హీరోల సినిమాల్లో, మంచి పాత్రల్లో నటిస్తోంది..!!

HAPPY BIRTHDAY RAJ THARUN!

serial actress Pavithra Jayaram dies in a car accident!