బుల్లితెర క్వీన్, వెండితెర రంగమ్మత్త అయిన అనసూయ చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన స్టైల్‌లో ఆమె స్పందిస్తుంటారు. అలాగే తన వృత్తి, వ్యక్తిగత వివరాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. అయితే తనపై ట్రోలింగ్ గురించి ఇటీవల పెద్దగా పట్టించుకోవడం లేదామె. దీంతో నెటిజన్లు ఎలాగైనా అనసూయను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో కవ్వించే వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటారు. అలాంటి వారికి గట్టిగానే ఆమె బుద్ధి చెప్పడం గతంలో చూశాం. తాజాగా అలాంటి ఘటనే పునరావృతమైంది.
తాజాగా ఓ నెటిజన్ మూడేళ్ల క్రితం నాటి ఫొటో షేర్ చేస్తూ అనసూయపై దూషణకు దిగాడు. అందరి అటెన్షన్ కోసం ఇలా చేస్తుందని నెటిజన్ ట్వీటర్‌లో పేర్కొన్నాడు. దీంతో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. నెటిజన్ అభ్యంతరకర కామెంట్‌పై అనసూయ సీరియస్‌గా స్పందించారు. “ఎపుడో మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నావు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకు లో బీపీ వచ్చింది. ఈ సంఘటన ఉదయం 5.30 సమయంలో జరిగింది. ఆ వివరాలేవీ తెలుసుకోకుండా ఇలాంటి అసభ్య కామెంట్స్ చేయకు. 22 గంటలు నాన్‌స్టాప్‌గా పని చేసిన కారణంగా కళ్లు తిరిగాయి. అంతే తప్ప నువ్వన్న కారణాలైతే ఎంత మాత్రం కావు” అని నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారామె.