in

telugu actress Ananya Nagalla Fired on Trollers!

నన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లేశం మూవీతో సినిమారంగ ప్రవేశం చేసింది. వకీల్‌ సాబ్‌ మూవీ ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇటీవల తంత్ర మూవీలో నటించింది. ఇటీవల ఈ బ్యూటీ సోషల్‌ మీడియా వేదికగా ‘ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి’ అంటూ పోస్ట్‌ చేసింది. ప్లాస్టిక్‌ స్ట్రాలకు బదులుగా స్టీల్‌ స్ట్రాలను వినియోగించాలని సూచించింది. దాంతో నటిని సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

నువ్వు ప్లాస్టిక్‌ వాడడం లేదా? నువ్వు చెప్పేదాంట్లో పాజిబులిటీ ఉందా? అంటూ పలువురు కామెంట్‌ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అనన్య గట్టి కౌంటర్‌ ఇచ్చింది. తన వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టించారని పేర్కొంది..తాను చెప్పినదాంట్లో నచ్చితే పాటించాలని..లేకపోతే వదిలేయాలని చెప్పింది. ప్రతీదానికి ట్రోల్‌ చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా..అనన్య చివరిసారిగా ‘డార్లింగ్‌’ మూవీలో నటించింది. ప్రస్తుతం పొట్టేల్‌ మూవీలో నటిస్తున్నది. ఈ మూవీలో ఈ నెలలో విడుదల కానున్నది.

Rashmika Mandanna to promote cyber safety as ambassador!