in

Tamannah Bhatia and Vijay Varma dating?

మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీకి బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. అక్కడ తమన్నా నటించిన పలు సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే దీనికి ఉదాహరణ. ఇక తమన్నా ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ బ్యూటీకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. గతకొంత కాలంగా తమన్నా ఓ బాలీవుడ్ యాక్టర్‌తో డేటింగ్‌లో ఉందని తెలుస్తోంది.

తెలుగులో నాని ‘MCA’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లోనూ ఈ యాక్టర్ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. న్యూ ఇయర్ వేడుకలను విజయ్ వర్మతో కలిసి తమన్నా కెమెరా కంటికి చిక్కినట్లుగా బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇలా ఓ బాలీవుడ్ యాక్టర్‌తో తమన్నా డేటింగ్ అనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో, ఈ వార్తపై తమన్నా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలని అభిమానులు కోరుతున్నారు. మరి తమన్నా డేటింగ్ వార్తల్లో నిజం ఉందా లేక ఇవి కూడా పుకార్లేనా అనేది తెలియాల్సి ఉంది..!!

Rashmika Mandanna missed this golden opportunity!

ismart Heroine Nabha Natesh Escapes Major Accident!