in

Swayam krushi BUDDODU YEMAYYADU!

స్వయం కృషి” చిత్రం లో నటించిన బుడ్డోడు ఏమయ్యాడు.నేటి బాల నటి, నటులే రేపటి హీరో, హీరోయిన్లు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది బాల నటులు హీరోలుగా వెలుగొందారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ కోవకు చెందిన వారే బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ యెన్.టి.ఆర్., శ్రీదేవి, మీనా. రాశి వంటి వారు. స్వయం కృషి సినిమా లో చిరంజీవి మేనల్లుడు గ అదరగొట్టిన బాల నటుడు మాస్టర్ అర్జున్, ఆ తరువాత కృష్ణ, శ్రీదేవి తో ” పచ్చని కాపురం”, శోభన్ బాబు, సుహాసిని తో ” ఇల్లాలు ప్రియురాలు” వంటి చిత్రాలలో నటించాడు.

వీడు పెద్దయి హీరో అయితే అదరగొడతాడు అనుకున్నారు అందరు. టీనేజ్ కి వచ్చిన తరువాత కన్నడ లో ఒక చిత్రం లో హీరో గ నటించాడు అది అంత విజయవంతం కాలేదు. అంతటితో తన నట ప్రస్థానానికి గుడ్ బై చెప్పేసాడు అర్జున్. అర్జున్ కి క్లాసికల్ డాన్స్ సంగీత మీద ఇంటరెస్ట్ ఉండటం తో వాటిలో కూడా ప్రవేశం సంపాదించాడు, తన చదువును కూడా కొనసాగించి డాక్టర్ అయ్యాడు. ప్రస్తుతం అమెరికాలో డాక్టర్ గ సెటిల్ అయ్యి నృత్య, ప్రదర్శనలు, గజల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు.

Sony Charishta at Manepally Jewellers Dhanteras Collection!

Macho hero as villain in Mahesh Babu – Rajamouli film?