
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ఒకరు. అందం, అభినయంతో పాటు సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆమె నటించిన 'భోగి' సినిమా ప్రమోషన్స్‌కు అనుపమ దూరంగా ఉండటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా, సంపత్ నంది దర్శకత్వం వహించారు. డింపుల్ హయాతి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా తన సినిమాల ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనే అనుపమ.. భోగి చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరుకాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు మ్యూజికల్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
ఈ కార్యక్రమాల్లో హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది తో పాటు డింపుల్ హయాతి పాల్గొన్నారు. అయితే సినిమాలో కథానాయికగా నటించిన అనుపమ మాత్రం ఈ రెండు వేడుకల్లోనూ కనిపించలేదు. దీంతో ఆమె ఎందుకు ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు డింపుల్ హయాతి మాత్రం ప్రమోషన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. శర్వానంద్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అనుపమ పాత్రకు సంబంధించిన విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొదట డింపుల్ హయాతిని సినిమాలో సహాయక పాత్ర కోసమే ఎంపిక చేశారని, అయితే కథలో జరిగిన మార్పుల కారణంగా ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత లభించిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అనుపమ పాత్రకు ప్రాధాన్యత తగ్గిందని, ఈ విషయంలో ఆమె అసంతృప్తిగా ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. అనుపమ కానీ, చిత్రబృందం కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మిగిలిన ప్రమోషనల్ కార్యక్రమాల్లోనైనా అనుపమ పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె గైర్హాజరీపై వస్తున్న ప్రచారానికి భోగి టీమ్ ఏమైనా వివరణ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అనుపమ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం..ఆమె తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కలిపి దాదాపు పది సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఒక తెలుగు సినిమాకు సైన్ చేయగా, ఒక తమిళ చిత్రాన్ని పూర్తి చేశారు. మరో రెండు తమిళ సినిమాలు, మూడు మలయాళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు..!!
