in

saleema, EEME YEVARU ?

మె పేరు సలీమా మలయాళ నటి , ఈమె ఒక ప్రముఖ తెలుగు హాస్య నటి కుమార్తె, ఈమె అసలు పేరు కాళేశ్వరి దేవి ఒక తెలుగు సినిమాలో అక్కినేని కుమార్తె గ నటించింది. ఈమె ఎవరో తెలుసుకోవాలని ఉందా? రేలంగి గారికి జోడిగా నటించి, అప్పటి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ హాస్య నటి గిరిజ గారి కుమార్తె. 1982 లో దాసరి నారాయణ రావు దర్సకత్వం లో వచ్చిన ” మేఘ సందేశం” చిత్రంలో అక్కినేని, జయసుధ ల కుమార్తె గ నటించింది, అదే సంవత్సరం ” ప్రతీకారం” అనే తెలుగు సినిమాలో నటించింది.

ముద్దుగా కుందనపు బొమ్మ లాగా ఉన్న ఈ అమ్మాయిని చూసి అందరు ఎవరబ్బా ఈ అమ్మాయి అనుకున్నారు. ఆ తరువాత ఏ తెలుగు చిత్రంలోనూ కనిపించ లేదు, తెలుగు ప్రేక్షకులు ఆమెను మరచిపోయారు. ఆమె కాళేశ్వరి దేవి అనే పేరును సలీమా గ మార్చుకొని మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించి హీరోయిన్ గ మోహన్ లాల్ వంటి పలు అగ్ర హీరోల ప్రక్కన నటించింది, సలీమా పలు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. కొంత కాలం చిత్ర సీమ నుంచి అంతర్ధానం అయిన సలీమా, ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా మలయాళ చిత్ర సీమలో కంటిన్యూ అవుతున్నారు.

happy birthday krishnam raju!

Here’s How Shruti Haasan And Santanu started Their Love affair!