in

surya finally delivered a hit!

చాలా కాలంగా మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆ ఆశ తీరింది. అయితే, అది డబ్బింగ్ సినిమా కావడం కొంత నిరాశ అయినా, కరోనా వేళలో ఒటీటీ బాటలో ఉత్తి చెత్త సినిమాలను చూస్తూ కాలక్షేపం చేస్తున్న ప్రేక్షకులకు ‘ఆకాశమే హద్దు’ గా నటుడు సూర్య వినోదాన్ని అందించారు. అవును.. సూర్య నటించిన ”ఆకాశం నీ హద్దురా” సినిమా ఈరోజు (12.11.2020) అమెజాన్ ప్రైం లో విడుదల అయింది. ఒటీటీ లో ఇప్పటివరకూ నేరుగా విడుదలైన సినిమాలు అన్నీ ప్రేక్షకులను నిరాశ పరిచాయి. మొదటిసారిగా ఈ సినిమా అందరూ మెచ్చేలా వచ్చింది.

ఈ సినిమా సూర్య సినిమా. అతన్ని తప్పితే మరొకర్ని ఈ సినిమాకి ఊహించలేనంతగా పాత్రలో ఇమిడిపోయారు సూర్య. కొన్ని సన్నివేశాల్లో అయితే.. అప్రయత్నంగా సూర్య నటనకు మనం చప్పట్లు కొట్టేస్తాం. అంత అద్భుతంగా చేశారు సూర్య. ఇక విలన్ గా పరేష్ రావెల్.. భాక్తవత్సలంగా మోహన్ బాబు.. తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటన చూపించారు. హీరోయిన్ అపర్ణ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఇతర పాత్రలు ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోయినా ఆకట్టుకునేలా చేశారు.

TAMIL ACTOR ARYA IN ALLU ARJUN’S PUSHPA?

ANIL RAVIPUDI MULTI STARRER WITH NAG AND AKHIL!