in

TAMIL ACTOR ARYA IN ALLU ARJUN’S PUSHPA?

సుకుమార్  దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రంలో నటించే విలన్ ఎవరన్న విషయమై గత కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఈ పాత్రకు బుక్ చేశారు. అయితే, తర్వాత డేట్స్ సమస్య రావడంతో ఆయన తప్పుకున్నాడు. ఆ తర్వాత ఒకరిద్దరు తమిళ, హిందీ నటుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ పాత్రకు తమిళ నటుడు ఆర్య పేరు తెరపైకి వచ్చింది. గతంలో బన్నీ నటించిన ‘వరుడు’ సినిమాలో ఆర్య విలన్ గా నటించాడు.

ఇప్పుడతను ‘పుష్ప’కు కూడా ఫైనల్ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆర్య సుపరిచితుడు కావడం వల్ల అతనినే తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇదిలావుంచితే, లాక్ డౌన్ గ్యాప్ అనంతరం ఈ చిత్రం షూటింగును తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నాడు.

Avika Gor introduces boyfriend Milind Chandwani!

surya finally delivered a hit!