సుకుమార్ మరియు విజయ్ దేవరకొండ వీరి కాంబినేషన్లో సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. పుష్ప సినిమాను పూర్తి చేస్తూనే సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను సైలెంట్‌గా చేస్తూ వస్తున్నాడట. అందులో భాగంగా విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్నను హీరోయిన్గా నటింప చేయాలని సుక్కు భావిస్తున్నాడట.
ప్రస్తుతం సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీలో రష్మిక హీరోయిన్. ఈమె వర్కింగ్ స్టైల్‌కు ఫిదా అయిన సుకుమార్ ఆమెనే నెక్ట్స్ మూవీకి కూడా తీసుకోవాలనుకుంటున్నాడని టాక్. ఇదే కనుక నిజమైతే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించే మూడో చిత్రమిదే అవుతుంది. మరి హీరోయిన్ విషయంలో సుకుమార్ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.