in

star heroes wants new comers kriti shetty and kethika sharma!

సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే ఫుల్ కాంపిటీష‌న్‌. ఒక్క హిట్ ప‌డితే చాలు ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తాయి. అదే టైమ్‌లో కాంపిటీష‌న్ కూడా వ‌స్తుంది. ఉప్పెన‌తో స్టార్ డ‌మ్ తెచ్చుకుంది కృతిశెట్టి. అంద‌రితో బేబ‌మ్మ అని పిలిపించుకునేంత‌గా ఆ క్యారెక్ట‌ర్ ఫేమ‌స్ అయింది. దీంతో అ అమ్మ‌డుకు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈమెకు మ‌రో హీరోయిన్ పోటీగా వ‌స్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల‌యిన పూజా హెగ్ధే, ర‌ష్మికా మండ‌న్న మ‌ధ్యే పోటీ ఉంది.

కాగా కొత్త హీరోయిన్లలో ఇపుడు బేబ‌మ్మ‌, కేతిక శ‌ర్మ మ‌ధ్యే పోటీ నెల‌కొంది. రొమాంటిక్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది కేతిక. నాగ‌శౌర్య సినిమాలో న‌టిస్తూనే ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. దీంతో కొత్త హీరోయిన్ల‌ను తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు వీరిద్ద‌రి గురించే డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు ఆలోచిస్తున్నారంట‌. కాగా వీరిద్ద‌రూ వ‌రుస సినిమాల‌తో బిజీగా మారుతున్నారు. మ‌రి ముందు ముందు వీరిద్ద‌రిలో ఎవ‌రు స్టార్ హీరోయిన్ అవుతారో చూడాలి.

ramya krishna to play prabhas sister role in salaar?

HAPPY BIRTHDAY RAJ THARUN!