in

ramya krishna to play prabhas sister role in salaar?

కప్పుడు హీరోయిన్‌గా తన అందచందాలతో కుర్రకారుని అలరించిన నటి రమ్యకృష్ణ.. ఇప్పుడు విలక్షణమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘లైగర్‌’, ‘రిపబ్లిక్‌’ సినిమాల్లో నటిస్తోంది. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ వంటి భారీ చిత్రంతో తన కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రమ్యకృష్ణ. ఆ తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’,

‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తాజాగా ఆమె మరోసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో రమ్యకృష్ణ నటించనుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రభాస్‌ అక్కగా నటించనునే వార్తలు వినిపిస్తోన్నాయి..

after twitter Kangana Ranaut now accuses instagram of racism!

star heroes wants new comers kriti shetty and kethika sharma!