in

sreeleela..an headache for kriti shetty!

టాలీవుడ్ సినిమా దగ్గర హీరోయిన్ గా పరిచయం అయ్యి ఫస్ట్ సినిమా తోనే హిట్ అందుకున్న వాళ్లలో చాలా మంది బాగానే నిలదొక్కుకొని భారీ ఆఫర్స్ అనతి కాలంలోనే సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ యంగ్ జెనరేషన్ లో కూడా చాలా మంది యంగ్ హీరోయిన్స్ వచ్చారు. అలా గత ఏడాదిలో సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఇచ్చిన యంగ్ హీరోయిన్ నే కృతి శెట్టి. మరి ఈ యంగ్ బ్యూటీ అయితే ఉప్పెన సినిమాతో ఏకంగా 100 కోట్ల వసూళ్లు తన మొదటి సినిమా తోనే చూసేసింది. ఇక అక్కడ నుంచి నాన్ స్టాప్ ఆఫర్స్ ఆమెకి మొదలు కావడం వాటిని చకచకా కంప్లీట్ చేసేయడం కూడా అయ్యాయి.

కానీ ఈ అన్ని చిత్రాల్లో శ్యామ్ సింగ రాయ్ ఒకటే పెద్ద హిట్ అయ్యింది. కాగా అందులో కూడా మెయిన్ హీరోయిన్ అంత కూడా ఆమె కాదు. ఇక మిగతా సినిమాలు అన్నీ విఫలం కాగా ఇప్పుడు ఈమె ప్లేస్ లోకి మరో యంగ్ బ్యూటీ దూసుకొస్తోంది. పెళ్లి సందD అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకొని ఇప్పుడు ధమాకా అనే సినిమా తో మరో సెన్సేషనల్ హిట్ ని అందుకున్న హీరోయిన్ శ్రీ లీల. అయితే ఇక్కడ హిట్ అని కాకుండా టాలెంట్ సినిమాలో చూపించే డెడికేషన్ పరంగా కూడా ఇపుడు ఆడియెన్స్ శ్రీ లీలకే ఎక్కువ మార్క్స్ వేస్తున్నారు. మరి దీనితో అయితే ఈ రకంగా కృతి శెట్టి ప్లేస్ కి ఈ యంగ్ హీరోయిన్ ఎసరు పెట్టింది. ఇక ఓవర్ టేక్ చేసేస్తుందో లేదో అనేది ఆమె ఎంపికలపై చూడాలి..!!

N.T.R. DARSAKUDIGA MARINA VELA!

stunning kannada actress Ashika Ranganath makes tollywood debut!