in

Prabhas and Sukumar film on Cards?

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” మరియు నాగ్ అశ్విన్ తో “ప్రాజెక్ట్ కే” సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని సైన్ చేశారు. అంతేకాకుండా అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగ తో కూడా “స్పిరిట్” అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమా షూటింగులు పూర్తయ్యాక “స్పిరిట్” సినిమా షూటింగ్ పట్టాలెక్కబోతోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా 2024 లో సెట్స్ పైకి వెళ్లబోతోంది. తాజాగా ప్రభాస్ ని కలిసిన సుకుమార్ ఒక ఐడియాని చెప్పారట. అది బాగా నచ్చడంతో ప్రభాస్ కూడా ఓకే చేసేసారు. సుకుమార్ కి కూడా ఎప్పటినుంచో ప్రభాస్ తో కలిసి పని చేయాలని ఉంది. “పుష్ప” సినిమా తరువాత ప్రభాస్ తో సినిమా చేయడానికి సుక్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..!!

happy birthday naveen polishetty!

N.T.R. DARSAKUDIGA MARINA VELA!