తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది సమంత. ఈ చెన్నై సుందరి ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే సామ్‌కు స్టార్ స్టేటస్ విషయంలో క్రేజ్ మాత్రం కావాల్సినంత ఉంది. కానీ రెమ్యునరేషన్ విషయానికొచ్చేసరికి కొంత వెనకబడిపోయిందనే అంటున్నారు సినీ జనాలు. ఈ భామ తెలుగు లేదా తమిళ సినిమాలకు కేవలం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ ఉంది. అయితే ఇది మాత్రం మిగిలిన స్టార్ హీరోయిన్లతో పోల్చి చూస్తే మాత్రం తక్కువనే చెప్పాలి.
లీడింగ్ స్టార్ హీరోయిన్లైన నయనతార, పూజాహెగ్డే 3 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని ఇప్పటివరకు వచ్చిన కథనాల సారాంశం. కాగా సమంత ఇపుడు కొత్త టార్గెట్ పెట్టుకుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది..రెమ్యునరేషన్ విషయంలో పూజాహెగ్డేను మించి పోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ఇపుడు సినీ జనాలు తెగ చర్చించుకుంటున్నారు..ప్రస్తుతం తెలుగు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఖుషీ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది సామ్. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్‌తో కూడా సినిమా చేస్తోంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు హిట్టయితే సామ్ కూడా పూజాహెగ్డే అంత డిమాండ్ చేయడం పక్కా అంటున్నారు మూవీ లవర్స్.