సినీ నటి సౌందర్య.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈమె మహానటి తర్వాత అంతటి నటి సౌందర్య.. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించిన ఈమె ఎవరు ఊహించిన విధంగా చిన్న వయసులోనే మృతి చెందింది. సావిత్రి అంతటి నటి అని అనుకున్న సమయానికి సావిత్రి లనే చిన్న వయసులో మరణించింది. అలాంటి అద్భుత నటి నటించిన టాప్ 5 తెలుగు చిత్రాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
టాప్ 5 సౌందర్య సినిమా.. అంతఃపురం
ఈ సినిమాలో సౌందర్య నటన అద్భుతం అనే చెప్పాలి.. పిచ్చి అమ్మాయిల నటించి బాబు పుట్టక భర్త ఫ్యాక్షన్ గొడవల్లో మరణిస్తే ఆ బాబును వాళ్ళ మామ గారి దగ్గర నుండి ఎలా కాపాడుకుంటుంది అనేది..క్షణక్షణం ఉత్కంఠం అనే చెప్పాలి. ఇంకా అలాంటి అద్భుతమైన ఈ సినిమాను ఎన్ని సార్లు చుసిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.
టాప్ 4 సౌందర్య సినిమా.. రాజా
అబ్బో ఈ సినిమా గురించి ఎం అని చెప్పుది.. ఎంత అని చెప్పేది.. ఒక దొంగను మంచి మాటలు చెప్పి మనిషిగా మార్చింది అని.. ఆమె కష్టాల్లో ఉన్న సమయంలో ఆమెను ఆదరించి ఆమెను మంచి సింగర్ గా చేసి ఆమెకు మంచి జీవితాన్ని అందిస్తాడు.. అలాంటి అతని గురించి మంచి చెప్పి చివరికి పెళ్లి చేసుకుంటుంది.
టాప్ 3 సౌందర్య సినిమా.. నరసింహ
ఈ సినిమాలో ఈమె పాత్ర పెద్దగా లేకపోయినా సినిమా అంత ఈమె చుట్టూనే తిరుగుతుంది.. నీలాంబరి.. రజినీకాంత్ అంత కలిసి సినిమాను ఓ రేంజ్ లో హిట్ చేశారు అంటే నమ్మండి.. ఇంకా ఈ సినిమాను ఎన్ని సార్లు అయినా చూడచ్చు.
టాప్ 2 సౌందర్య సినిమా.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
అబ్బో ఈ సినిమాలో ఏమైనా కామెడీ ఉందా? ఎంత కామెడీ సినిమా ఇది.. వెంకటేష్ ఇబ్బందులు పడుతుంటే కోట శ్రీనివాస్ రావు చేసే అల్లరి అబ్బో.. ఈ సినిమాను ఎన్ని సార్లు చుసిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తాయి అంటే నమ్మండి.
టాప్ 1 సౌందర్య సినిమా.. నిన్నే ప్రేమిస్త
సౌందర్య.. నాగార్జున.. శ్రీకాంత్.. సినిమా అద్భుతం… నాగార్జున కళ్ళు శ్రీకాంత్ కి పెట్టడం.. శ్రీకాంత్ ని పదే పదే ఆమె చూడటం వల్ల ప్రేమించటం అంత కొంచం కన్ఫ్యూషన్ అయినప్పటికీ ఆ సినిమా చాల బాగుంటుంది చూడటానికి… అందుకే ఆ సినిమాకు ఫాన్స్ ఎక్కువ. మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూడచ్చు.
నిజం చెప్పాలి అంటే? సౌందర్య నటించిన అన్ని సినిమాలు అద్భుతమే.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తాయి ఆ సినిమాలు. అందుకే ఈ టాప్ 5 ఏ కాకుండా మిగితా సినిమాలు కూడా చుడండి… చాలా చాలా బాగుంటాయి.