క్యాన్సర్ రోగాన్ని జయించడం అంత సులభమైన పనేమీ కాదు. ఎంతో మంది డబ్బులు ఉన్నా కూడా ధైర్యం, నమ్మకం లేక క్యాన్సర్‌కు బలవుతుంటారు. ఆత్మ సంకల్పం ఉండి క్యాన్సర్‌ను జయించిన వారు కూడా ఉన్నారు. ఆ జాబితాలో హీరోయిన్ సోనాలి బింద్రే కూడా ఉంటారు. క్యాన్సర్ బారిన పడిన ఆమె దాన్ని జయించి ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అయితే నిన్న క్యానర్స్‌ను జయించిన వారి దినోత్సవం. ఈ సందర్భంగా సోనాలి బింద్రే తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
2018లో సోనాలి బింద్రే క్యానర్స్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. సోనాలికి మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చికిత్స కోసం ఆమె అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్‌లో ఉండి క్యాన్సర్‌తో ఇండియాకు దిగ్విజయంగా తిరిగి వచ్చారు. సోనాలి బింద్రే తన అనారోగ్యం గురించి చాలాసార్లు బహిరంగంగా మాట్లాడారు. క్యాన్సర్ సమయంలో ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు పట్టుదలతో ముందుకు సాగింది. అంతే కాకుండా ఈ పోరాటంలో ఆమె భర్త గోల్డీ బెహ్ల్, కుమారుడు రణవీర్ బహ్ల్ నైతికంగా మద్దతిచ్చారు..