కరోనా కారణంగా థియేటర్లకు రావాల్సిన సినిమాలన్నీ ఓటీటీలకే పరిమితం అయ్యాయి. సోలో బతుకే సో బెటర్
కూడా ఓటీటీలోనే రావల్సింది. జీ 5 ఈ సినిమా హక్కుల్ని కొనుక్కుంది. అయితే థియేటర్లు మళ్లీ తెరచుకోవడంతో.. థియేటరికల్ రిలీజ్‌కి ఆస్కారం ఏర్పడింది. అయితే అది మంచికే అయ్యింది. తొలి మూడు రోజులూ.. సోలో బతుకే
మంచి వసూళ్లని అందుకుంది. కరోనా సమయంలోనూ..
ఇలాంటి రాబడి తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. నెగిటీవ్ టాక్ వచ్చినా – నిర్మాతలు హ్యాపీగా ఉన్నారంటే, దానికి కారణం.. తొలి మూడు రోజుల వసూళ్లే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ రాబోతోంది. జనవరి 1న జీ 5లో ఈ సినిమాని ప్రదర్శిస్తారు. అయితే పే ఫర్ వ్యూ పద్ధతిన ఈ సినిమా చూడొచ్చు. 149 రూపాయలు పెట్టి టికెట్ కొంటే, ఇంటిల్లిపాదీ ఒకేసారి ఈ సినిమా చూసేయొచ్చు.