
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త చిత్రం RAPO23 ఇటీవల అధికారికంగా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో రామ్ కేవలం హీరోగానే కాకుండా, కథను కూడా స్వయంగా సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో దర్శకుడిగానూ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ నిర్మించనున్నారు.
ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం మొదట ఫహద్ ఫాజిల్ పేరును పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పాత్ర కోసం తమిళ స్టార్ నటుడు ఎస్.జె. సూర్య ను మూవీ టీమ్ ఫైనల్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు ఎస్.జె. సూర్య దాదాపు రూ.5 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు సమాచారం. ఈ స్థాయి రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమయ్యారంటే కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!
