in

Meenakshi Chaudhary Career All Hopes On These Films!

meenakshi chaudhary career all hopes on these films!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది..అక్కినేని నాగచైతన్య హీరోగా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ‘వృశకర్మ’ సినిమాపై మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతో తన కెరీర్‌కు మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌లో మీనాక్షి కనిపించిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన ఆమె, ఈసారి కొంత సీరియస్‌గా సాగే పాత్రలో నటించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.

ముఖ్యంగా ఆమె లుక్, పాత్ర స్వభావం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో మీనాక్షి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ‘వృశకర్మ’ విజయం సాధిస్తే ఆమెకు మరిన్ని కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ చిట్‌చాట్‌లో కూడా ఈ సినిమా విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేస్తానని మీనాక్షి తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం ‘వృశకర్మ’పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు మీనాక్షి చౌదరి తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. తమిళ హీరో కార్తీతో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతానికి ‘కార్తీ 30’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు..

గతంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ బయటకు రాలేదు. మీనాక్షి సైతం ఇంటర్వ్యూల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా స్పందించలేదు. దీంతో అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కార్తీకి ఇటీవల వరుస పరాజయాలు ఎదురవుతున్నప్పటికీ, ఆయన కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘కార్తీ 30’ మంచి విజయం సాధిస్తే మీనాక్షికి కూడా మరో హిట్ దక్కినట్లే. మొత్తానికి ఈ ఏడాది ‘వృశకర్మ’, వచ్చే ఏడాది కార్తీతో చేయబోయే సినిమా విజయవంతమైతే మీనాక్షి చౌదరి కెరీర్ మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల ఫలితాలపైనే ఆమె తదుపరి ప్రయాణం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘వృశకర్మ’లో మీనాక్షి చౌదరి పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె వెల్లడించింది..!!

allu aravind funny comments on ruhani sharma!

Allu Aravind Funny Comments On Ruhani Sharma