in

Keerthy Suresh opened up about losing 10 kg in 9 months!

కీర్తి సురేష్ చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు కొంచెం బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె చాలా సన్నగా మారిపోయింది. అయితే బరువు తగ్గేందుకు ఆమె సర్జరీ చేయించుకుందనే వదంతులు వచ్చాయి. అయితే వాటిని నిర్మొహమాటంగా కీర్తి సురేష్ ఖండించింది. తాజాగా ఓ వీడియోలో మాట్లాడుతూ కీర్తి సురేష్ ఇలా అన్నారు. “నేను సర్జరీ చేయించుకోలేదు. 9 నెలల కఠోర శ్రమ తర్వాత నేను 10 కేజీల బరువు తగ్గి సన్నగా అయ్యాను. కానీ నేను సర్జరీ వల్లే సన్నబడ్డానని కొంతమంది నాపై రూమర్లు క్రియేట్ చేస్తున్నారు” అని అన్నారు.

“అలాంటి రూమర్లు నాకు బాధను కలిగించాయి. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కలేని ఆవేదన కలిగింది. ఇప్పుడు నా దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి. కష్టపడి బరువు తగ్గాను” అని ఆమె చెప్పుకొచ్చింది. “నన్ను నేను చూసుకునే విధానం నాకు నచ్చుతుంది. నా గురించి నేను గర్వపడతాను. కానీ జనాలు నా గురించి మాట్లాడటం ఆపరు. ‘నేను లావుగా ఉంటే నువ్వు సన్నగా ఉన్నావు, నేను సన్నగా ఉంటే నువ్వు లావుగా ఉన్నావు’ అంటారు” అని కీర్తి సురేష్ తన కోపాన్ని వ్యక్తం చేసింది..!!

sj suriya demands high for Ram Pothineni’s Directorial Debut!

Prashanth Neel Reveals How Jr NTR Lost 15 Kg In 4 Months!