in

shurthi haasan left the shooting spot of vijay’s movie!

విజయ్‌ సేతుపతి హీరోగా ఎస్పీ జననాథన్‌ తెరకెక్కిస్తున్న ‘లాభం’ అనే తమిళ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న శ్రుతిహాసన్ సెట్ నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్‌-శ్రుతిహాసన్ ‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో చిత్రీకరణ జరిగే చోటుకి వచ్చారు. దీంతో శ్రుతిహాసన్‌.. షూటింగ్‌ మధ్యలోనే సెట్‌ నుంచి వెళ్లిపోయారు. కోవిడ్-19 వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉండడంతో శ్రుతిహాసన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కరోనా వల్ల ప్రతి ఒక్కరికీ ప్రమాదం ఉందని, ప్రోటో కాల్స్‌ ఫాలో కాని తరుణంలో ఒక మహిళగా, సినీ నటిగా పలు నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు ఉందని ఇటీవలే ఆమె ట్వీట్ చేసింది.

AKHIL TO ROMANCE ‘NATIONAL CRUSH OF INDIA’!

OKKA RAGHAVENDRA RAO GAaRE SADINCHINA ARUDHAINA GANATHA!