in

Shruti Haasan prayed ‘a thousand times’ that men get periods!

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. తనకు పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్* సమస్య ఉందని, దీనివల్ల పీరియడ్స్ సమయంలో తాను తీవ్రమైన నరకం అనుభవించానని వెల్లడించారు. చిన్న వయసు నుంచే పీరియడ్స్ తనకు ఎంతో బాధాకరంగా ఉండేవని ఆమె గుర్తుచేసుకున్నారు. కొన్నిసార్లు విపరీతమైన కడుపునొప్పి, వాంతులు, చివరకు స్పృహ కోల్పోయే స్థాయికి పరిస్థితి వెళ్లేదని, పలుమార్లు ఆసుపత్రిపాలయ్యానని చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ సమస్య ఆమెకు మరింత సవాలుగా మారిందట. కెమెరా ముందు నవ్వుతూ నటించాల్సి వస్తున్నప్పటికీ, తెరవెనుక ఆమె పడుతున్న వేదన అంతా ఇంతా కాదు..

ఒకసారి తన పీరియడ్స్ సమస్య గురించి ఓ దర్శకుడికి ఓపెన్‌గా వివరించారట. ఆ దర్శకుడికి కూతురు ఉండటంతో ఆమె పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకుని ఎంతో సానుకూలంగా స్పందించారు. అప్పట్నుంచి తన సమస్యలను దాచుకోవడం మానేసి, అవసరమైనప్పుడు ధైర్యంగా చెప్పడం ప్రారంభించానని శ్రుతి తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ మగవాళ్లపై చేసిన వ్యాఖ్యలు తెగ నవ్విస్తున్నాయి. ఒకవేళ పురుషులకు కూడా పీరియడ్స్ వస్తే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చంటూ ఆమె సరదాగా సెటైర్లు వేశారు. మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుంది. ఒకవేళ అలా జరిగితే..హీరోయిన్లతో కుదుర్చుకునే కాంట్రాక్టుల్లో పీరియడ్స్ సెలవుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆ రోజుల్లో వారికి కచ్చితంగా హాలిడేస్ ఇచ్చే ఏర్పాట్లు చేసేవారేమో అంటూ ఆమె నవ్వులు పూయించారు..!!

PATHETIC INCIDENT IN nassar’S LIFE!

Allu Arjun and Atlee’s Raaka Creates World Record Pre-Release!

Allu Arjun and Atlee’s Raaka Creates World Record Pre-Release!