in

Shruti Hassan Changed Her Name In School To Avoid celebrity status!

కమల్ హాసన్ కూతురిగా జన్మించడం శ్రుతి హాసన్కి అంత ఈజీగా జీవితం సాగలేదు. చిన్నప్పటి నుంచే స్టార్ కిడ్‌గా అందరి దృష్టిలో ఉండే పరిస్థితి ఆమెకు ఉండేది. అయితే తన స్కూల్ జీవితాన్ని మాత్రం చాలా సాధారణంగా గడపాలని శ్రుతి కోరుకుందట. అందుకే స్కూల్‌లో తన ఒక వింత ప్లాన్ వేసి చదివాను అని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. శ్రుతి ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో తన స్కూల్లో జరిగిన సంఘటన గురించి చెప్పకు వచ్చింది. శృతిహాసన్ మాట్లాడుతూ, తాను స్కూల్‌లో “పూజా రామచంద్రన్” అనే పేరుతో చదివానని తెలిపింది..

స్కూల్ రికార్డుల్లో తన తండ్రి పేరు కూడా “డాక్టర్ రామచంద్రన్” అని నమోదు చేశారని చెప్పింది. తన కుటుంబం గురించి, ముఖ్యంగా కమల్ హాసన్ కూతురిననే విషయం క్లాస్‌మేట్స్‌కు ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. తనను ఒక స్టార్ హీరో కూతురిగా కాకుండా సాధారణ విద్యార్థినిగా చూడాలని తాను కోరుకున్నానని శ్రుతి చెప్పింది. తన వ్యక్తిత్వాన్ని చూసి స్నేహితులు దగ్గర కావాలని అనుకున్నానని తెలిపింది. పేరెంట్స్ ఫేమ్ వల్ల ప్రత్యేక గుర్తింపు రావడం తనకు ఇష్టం లేదని కూడా చెప్పింది. ఈ నిర్ణయం వల్ల స్కూల్ జీవితాన్ని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపగలిగానని ఆమె వివరించింది..!!

Drishyam 3!

happy birthday k RAGHAVENDRA RAO!