
ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే షెఫ్ లేదా ఈవెంట్ మేనేజర్ అయ్యేదాన్నని పేర్కొన్నారు. ఆమె తన పనిపైనే దృష్టి పెడుతూ, రూమర్లను పట్టించుకోనని స్పష్టం చేశారు. జాతిరత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రతో కుర్రకారు మనసు దోచుకుంది ఆరడుగుల సుందరి ఫరియా అబ్దుల్లా. తన చలాకీతనం, నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, తాజాగా ప్రేమ, పెళ్లిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే తనదైన స్వతంత్ర ఆలోచనలతో ఫరియా అందరినీ ఆశ్చర్యపరిచింది.”
“పెళ్లి గురించి ఫరియా మాట్లాడుతూ..తన దృష్టిలో ప్రేమ, పెళ్లి అనేవి రెండు వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది. “మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అనే భావన మనసుకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. జీవితానికి తోడు అనేది కచ్చితంగా అవసరమే. పెళ్లి వల్ల ఒక మనిషి తనను తాను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ ప్రస్తుత తరం పెళ్లి అనే బంధంపై ఆసక్తిని కోల్పోతోంది. రాబోయే కాలంలో వివాహం అనే మాటకు అర్థమే మారిపోవచ్చు” అంటూ ఆమె విశ్లేషించింది. పెళ్లిపై యువత ఆలోచనా ధోరణి మారుతోందన్న ఆమె మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.”..!!
