ఇటీవల ఫిజికల్ ప్రాబ్లెమ్స్ తో సతమతమవుతున్నట్లు తెలిపింది స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. మెంటల్ గా ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ..హార్మోన్ల సమస్యలు వేధిస్తున్నాయంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంది..జిమ్‌లో వర్క్ అవుట్స్ వీడియోను షేర్ చేస్తూ..ప్రస్తుతం కొన్ని చెత్త హార్మోన్ల సమస్యల నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్న అంటూ ఆమె పేర్కొంది.హార్మోనల్ ఇమ్ బ్యాలెన్స్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయానేది మహిళకే బాగా తెలుసంటూ చెప్పుకొచ్చారు. అయితే దీని గురించి ఎక్కవగా బాధపడకుండ టైమ్ కి తినడం,నిద్ర,వ్యాయామం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి వాటిని ధైర్యంగా స్వీకరించి జీవితాన్ని మరింత ధృఢంగా మార్చుకోవాలని అభిమానులకు సూచించడం విశేషం. ఇది కాస్తా నెట్టింట్లో వైరల్ కావడంతో అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.