జయప్రద ఇబ్బంది పడిన వేళ! ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎవరి వలన ఇబ్బంది పడ్డారు?. వెండి తెర మీద జయప్రద తనదంటూ ఒక ముద్ర వేశారు, శాస్త్రీయ నృత్యం లో నిష్ణాతురాలయిన జయప్రద గారు ఎన్నో క్లాసికల్ చిత్రాలలో నటించారు. తెలుగు అమ్మాయి అయిన జయప్రద దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ లో కూడా అగ్ర కధానాయిక గ కొనసాగారు. ” దేవుడే దిగివస్తే” చిత్రం షూటింగ్ లో ఆమె ఒక ఇబ్బంది కరమయిన పరిస్థితి ఎదుర్కొన్నారు. దర్శకుడు దాసరి షాట్ రెడీ డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మనగానే మేక్ అప్ రూమ్ లోకి వెళ్లిన జయప్రద అక్కడ ఉన్న “బికినీ” చూసి ఆశ్చర్యాన్ని గురి అయ్యారు, వెంటనే బయటకు వచ్చి నేను బికినీ వేసుకోను గురువు గారు అని ఏడ్చేశారట . నువ్వు బికినీ వేసుకున్న ఆడ్ గ ఉండదు, వెళ్లి వేసుకో అన్నారట.
ఇబ్బందిగానే బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లోకి దిగిన జయప్రదను ఒక ట్యూబ్ మధ్యలో ఉంచి సీన్ షూట్ చేశారట. ఆ తరువాత జయప్రద ఎప్పుడు బికినీ ధరించటానికి ఒప్పుకోలేదు, బికినీ వేసుకోవటం తప్పు కాదు కానీ, బికినీ లో నాకు కంఫర్ట్ గ అనిపించదు అందుకే వేసుకోలేదు అని చెప్పుకొచ్చారు జయప్రద. అందరు అన్ని డ్రెస్సులు వేసుకోవాలని రూల్ ఏమి లేదు, నాకు ఆ డ్రెస్ ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పే రైట్ అందరికి ఉంటుంది, అన్నిరకాల డ్రెస్ లు వేసుకొని,సిట్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి వేసుకున్నాము అని సమర్ధించుకొనే వారు కూడా ఉంటారు, ఎవరి ఇష్టం వారిది. స్కిన్ షో కొందరికి నచ్చవచ్చు, మరి కొందరికి నచ్చకపోవచ్చు.