ఒక నటిగా గుర్తింపు సంపాదించాలంటే ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేయగలగాలి. అందుకే జబర్దస్త్ యాంకర్ అనిపించుకున్న అనసూయ.. నటిగా కూడా పూర్తిస్థాయిలో గుర్తింపు సంపాదించాలి అనుకుంటోంది. ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో వేశ్య పాత్ర చేయడానికి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ షోతో యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. మెల్లగా నటిగా మారింది. ఇక రంగస్థలం చిత్రంలో తాను పోషించిన రంగమ్మత్త పాత్ర నటిగా తన కెరీర్‌నే మలుపు తిప్పింది. ఆ తర్వాత పుష్పలో విలన్‌గా ఆకట్టుకుంది.
ఇప్పుడు వేశ్యగా నటించి.. మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమవుతోందట అనసూయ. ఇలా సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా వస్తుండడంతోనే తాను జబర్దస్త్ కూడా వదిలేసిందని సమాచారం. స్టార్ డైరెక్టర్ క్రిష్.. ఓటీటీ సోనీ లివ్ కోసం ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నాడట. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించబడుతుందని సమాచారం. ఇందులో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ కనిపించనుందట. దీంతో పాటు అరి, ధర్జా అనే చిత్రాల్లో కూడా అనసూయ లీడ్ రోల్స్‌లో నటిస్తోంది.