in

telugu beauty Anjali turns item girl for Nithin’s next!

తెలుగమ్మాయి అంజలి సైతం ఐటెం సాంగ్‌తో బలమైన ముద్రే వేసింది. ఆమె ‘సరైనోడు’ సినిమాలో చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్ పెద్ద బ్లాక్‌బస్టర్ కావడం తెలిసిన విషయమే. అప్పటిదాకా అంజలికి ఉన్న హోమ్లీ ఇమేజ్‌కి.. ఐటెం సాంగ్ అసలు సెట్టవుతుందా అన్న సందేహాలు చాలామందికి కలిగాయి. కానీ అంజలి ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ఆ పాటలో అదరగొట్టింది. అల్లు అర్జున్‌కు దీటుగా స్టెప్పులేసి, హాట్‌గా కనిపించి మెప్పించింది. ఆ పాట అంత పెద్ద హిట్టయినా అంజలి ఆ తర్వాత మళ్లీ ఐటెం సాంగ్ చేయలేదు. ఎట్టకేలకు మళ్లీ ఆమెను మళ్లీ ఆ టైపు పాటలో చూడబోతున్నాం.

నితిన్ కొత్త చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం అంజలి మళ్లీ ఐటెం గర్ల్ అవతారం ఎత్తింది. ఈ పాట గురించి వెల్లడిస్తూ.. తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది ‘మాచర్ల నియోజకవర్గం’ టీం. కేవలం పోస్టర్‌తోనే అంజలి అందరి దృష్టినీ తన వైపు తిప్పేసుకుంది. అంత ఆకర్షణీయమైన లుక్‌తో కనిపిస్తోందీ తెలుగమ్మాయి. ఓవైపు ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి కొత్తగా రిలీజ్ చేసిన ఐటెం సాంగ్ విషయంలో నెగెటివిటీ కనిపిస్తున్న దశలోనే.. అంజలి ఐటెం సాంగ్ పోస్టర్ హైలైట్ అవడం విశేషం. మరి ఈ పాటలో అంజలి ఎలా మెరుపులు మెరిపిస్తుందో.. ఈ పాట ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

N.T.R. FIRST WIFE!

JAYAPRADA IBBANDI PADINA VELA!