in

Shahid Kapoor in talks to play pivotal role in AA23?

కాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో నటిస్తున్న ఆయన, ఆ సినిమా పూర్తయ్యాక దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తన 23వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ‘AA23’ వర్కింగ్ టైటిల్‌తో ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్‌కు ధీటుగా నిలిచే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పేరును పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో విలన్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈసారి కూడా హీరోతో సమానంగా పోటీపడే పవర్‌ఫుల్ నెగెటివ్ క్యారెక్టర్‌ను ఆయన డిజైన్ చేసినట్లు సమాచారం. అలాంటి పాత్రలో షాహిద్ కపూర్ కనిపిస్తే సినిమా స్థాయి మరో లెవల్‌కు చేరుతుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది..!!

TRAGIC END OF A LADY COMEDIAN!

fed up Mamitha baiji decided to take a break from social media!